schedule Saturday, September 19, 2026

పైలెట్ పచ్చబొట్టు..!

calendar_today November 4, 2023
person dharshininews
పైలెట్ పచ్చబొట్టు..!
పైలెట్ పచ్చబొట్టు..! - గుండెలపై వేసుకున్న అభిమాని - ఫిధా అవుతున్న నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాన్యంగా హీరోలకు, క్రికెటర్లకు వీరాభిమానులు ఉండడం సహజం. రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉండడం తక్కువే. ఎవరైనా తమ అభిమాన హీరోలు, నేతల, ఆటగాళ్లను పేర్లను పచ్చబొట్టుగా వేసుకుంటున్నారు. మరీ ప్రేమ ఎక్కువ ఉన్నవాళ్లు తమ అమ్మ ఫోటోనో, భార్య ఫోటోనో, లేక ప్రియురాలి ఫోటోతో గుండెలపై పచ్చబొట్టు వేసుకుంటారు. కానీ ఓ రాజకీయ నాయకుడి బొమ్మను పచ్చబొట్టుగా గుండెలపై వేసుకున్నాడు ఓ అభిమాన కార్యకర్త. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఓమ్లానాయక్ తాండాకు చెందిన సికిందర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. అతనికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అంటే వీరాభిమానం. అందుకనే తన గుండెలపై పైలెట్ రోహిత్ రెడ్డి బొమ్మను పచ్చబొట్టుగా వేసుకున్నారు. ఈ విషయం తెలసినా.. చూసిన నేతలు అతని అభిమానానికి ఫిదా అవుతున్నారు. అభిమానాన్ని చాటుకున్న సికిందర్‌ను పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు అభినందిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21516/