schedule Thursday, September 17, 2026

దోస్త్ ఆ.. రహా..హై..!

calendar_today November 28, 2023
person dharshininews
దోస్త్ ఆ.. రహా..హై..!
దోస్త్ ఆ.. రహా..హై..! - బీఆర్ఎస్ బైక్ ర్యాలీకి మంచు మనోజ్ - ఆహ్వానించనున్న పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి, సీనీ హీరో మంచు మనోజ్ మద్య ఉన్న స్నేహ సంబంధం గురించి అందరికి తెలిసిందే. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం మంచు మనోజ్ తాండూరుకు విచ్చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బైకు ర్యాలీలో సీనీ హీరో మంచు మనోజ్‌ ను ఆహ్వానించారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. దోస్తు కోసం మనోజ్ తాండూరులో సందడి చేయబోతున్నారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి నిర్వహిస్తున్న ర్యాలీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మంచు మనోజ్ బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నేతలు కోరారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22290/