schedule Sunday, September 13, 2026

మృతుని కుటుంబానికి భరోసా

calendar_today December 4, 2023
person dharshininews
మృతుని కుటుంబానికి భరోసా
మృతుని కుటుంబానికి భరోసా - రూ. 5వేల సాయం అందించిన ఆర్సీ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్.చంద్రశేఖర్(ఆర్సీ) గౌడ్ భరోసా అందించారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గిరిజాపూర్ అంజిలప్ప మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్సీ గౌడ్ సోమవారం మృతుని కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా అందించారు. అంజిలప్ప అంత్యక్రియల కోసం రూ. 5వేల ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. కుటుంబ సభ్యులు ఆర్సీ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22400/