schedule Sunday, September 13, 2026

ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

calendar_today December 26, 2023
person dharshininews
ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి - రాజ్యాధికారానికి శాంతియుతంగా పోరాడాలి - బీసీ దళపతి, సైకాలజిస్టు డా. పరికిపండ్ల అశోక్ - తాండూరులో బీసీ మ్యానిఫెస్టో పుస్తకావిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ దళపతి, సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. పరికిపండ్ల అశోక్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం వాల్మీకీనగర్ ఎంపీటీ హాల్ లో బీసీ ఉద్యమాల రూపకర్త స్వర్గీయ సాంబశివరావు రచించిన బీసీ మ్యానిఫెస్టో 5వ ముద్రణ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి డా. పరికిపండ్ల అశోక్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలు బీసీలు సగం -'బీసీలకు సగం అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. రాజ్యాధికారం కోసం శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు రిజర్వేషన్లలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బీజేపీ బీసీ సెల్ నాయకులు గాజుల సంపత్ కుమార్, సీనియర్ సిటిజన్ ఫోర్ం నాయకులు సత్యరాజు, మల్లేశం, ఆరోగ్య మిత్ర స్వచ్చంద సంస్థ ప్రతిని ధులు దామోదర్, సత్యం, బీసీ యువ నాయకులు విజయ్ చంద్ర, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22725/