schedule Sunday, September 13, 2026

తాండూరు ఆర్డీఓకు ఉత్తమ అవార్డు

calendar_today January 26, 2024
person dharshininews
తాండూరు ఆర్డీఓకు ఉత్తమ అవార్డు
తాండూరు ఆర్డీఓకు ఉత్తమ అవార్డు - జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావుకు ఉత్తమ అవార్డు వరించింది. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సామూహిక గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఉత్తమ అవార్డును అందుకున్నారు. ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు ఉత్తమ అవార్డులను అందించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉత్తమ పనితీరును ప్రదర్శించిన తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావుకు ఉత్తమ అవార్డును అందజేశారు. ఈ అవార్డును అందుకున్న ఆర్డీఓ శ్రీనివాస్ రావును జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ అవార్డును అందుకున్న ఆర్డీఓ శ్రీనివాస్ రావుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23433/