schedule Friday, September 04, 2026

మరో నెల రోజులు..!

calendar_today January 28, 2024
person dharshininews
మరో నెల రోజులు..!
మరో నెల రోజులు..! - రేషన్ ఈకేవైసీ గడువు పెంపు - ప్రకటించిన పౌర సరఫరాల శాఖ హైదరాబాద్, దర్శని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత లబ్ధిదారులు రేషన్‌ కార్డు కోసం ఎలక్ట్రానిక్‌ నో యూవర్‌ కస్టమర్‌ (ఈకేవైసీ) చేసుకోవడానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంచింది. ఈకేవైసీకి సేకరణ ఏడాది నుంచి ప్రారంభించారు. లబ్ధిదారులు పోటెత్తడంతో గడువు విధించలేదు. ఆ తర్వాత జనవరి 31తో ముగుస్తుందని ప్రకటించారు. రేషన్‌ కార్డులను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్రం పెంచింది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ 75.76 శాతం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ను ఆదేశించారు. ఎలా చేసుకోవాలంటే.. రేషన్‌ కార్డు కేవైసీ చేసుకోవడానికి రేషన్‌కార్డు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్ డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే, వినియోగదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోలడం లేదని అర్థం. దీంతో రేషన్‌ కార్డ్‌ నుంచి ఒక యూనిట్‌ను తొలగిస్తారు. రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయో, వారంతా ఒకే సమయంలో కేవైసీ కోసం రేషన్ దుకాణానికి వెళ్లాలి. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23490/