schedule Saturday, September 12, 2026

జిల్లాలో ఎస్ఐల బదిలీలు..!

calendar_today February 6, 2024
person dharshininews
జిల్లాలో ఎస్ఐల బదిలీలు..!
జిల్లాలో ఎస్ఐల బదిలీలు..! - కరణ్‌కొట్, తాండూరు ఎస్ఐలకు స్థాన చలనం - పరిగి, ధారూర్, మోమిన్‌పేట్‌ ఎస్‌ఐలకు కూడా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని పలువురు ఎస్ఐల బదిలీలు జరిగాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. జిల్లాలోని మోమిన్ పేట్‌లో పనిచేస్తున్న ఎస్ఐ విఠల్ రెడ్డిని తాండూరు సబ్‌ డివిజన్‌ కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ మధుసూధన్ రెడ్డిని చెన్గోముల్ పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. తాండూరు పట్టణ ఎస్ఐ అరవింద్‌ను మోమిన్ పేట్ ఎస్ఐగా బదిలీ చేశారు. చెన్గోముల్‌లో పనిచేస్తున్న ఎస్ఐ గిరెన్ననును పెద్దేముల్ పోలీస్టేషన్‌కు బదిలీ చేయగా పెద్దేముల్ ఎస్ఐ కాశినాథ్‌ను వికారాబాద్‌కు బదిలీ చేశారు. వికారాబాద్‌(వీఆర్) పోలీస్టేషన్‌లో పనిచేస్తున్న వీ.రమేష్‌ను బషీరాబాద్‌ పోలీస్టేషన్‌కు బదిలీ చేయగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను ధారూర్ పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. ధారూర్‌ పోలీస్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎం.సంతోష్‌ కుమార్‌ను పరిగి పోలీస్టేషన్‌కు బదిలీ చేయగా పరిగిలో పనిచేస్తున్న ఎస్ఐ జీవీ సత్యనారాయణను వికారాబాద్‌(వీఆర్) పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23650/