schedule Sunday, September 13, 2026

భళా.. చిన్నారులు..!

calendar_today February 9, 2024
person dharshininews
భళా.. చిన్నారులు..!
భళా.. చిన్నారులు..! - కేవీసీఎస్ లో జంతు దినోత్సవం - ఆకట్టుకున్న విద్యార్థుల జంతు వేషాధారణ తాండూరు, దర్శిని ప్రతినిధి : జన జీవనంలో జంతువుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైందని నిరూపిస్తూ తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్(కేవీసీఎస్) విద్యార్థులు భళా అనిపించుకున్నారు. శుక్రవారం పాఠశాలలో జంతు దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూలుకు చెందిన ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు వివిధ రకాల జంతువుల వేషాధారణలో ప్రదర్శనలు ఇచ్చారు. కుందేలు, పులి, జిరాఫీ, ఎలుగు బండి, ఇతర జంతువుల వేషాధారణలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ జంతువుల యొక్క జీవన విధానం జన జీవనంతో సమానమన్నారు. చిన్నారులు జంతువుల యొక్క జీవిధానాన్ని తెలిపేలా ఇచ్చిన ప్రదర్శనలు అభినందనీయమన్నారు. చిన్నారులు తమ ప్రదర్శనలతో భళా అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23699/