schedule Wednesday, September 16, 2026

తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ బదిలీ

calendar_today February 14, 2024
person dharshininews
తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ బదిలీ
తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ బదిలీ - కొత్త డీఎస్పీగా బాలక్రిష్ణ రెడ్డి - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. శేఖర్ గౌడ్ స్థానంలో తాండూరు కొత్త డీఎస్పీగా బాలక్రిష్ణ రెడ్డిని నియమించినట్లు అదే ఉత్తర్వుల్లో వెల్లడించారు. తాండూరు డీఎస్పీగా శేఖర్ గౌడ్ దాదాపు 20 నెలల పాటు విధులు నిర్వహించారు. తాండూరు కొత్త డీఎస్పీగా బాలక్రిష్ణ రెడ్డి త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23861/