schedule Saturday, September 12, 2026

పేదలకు అండగా వైశ్య ఫెడరేషన్

calendar_today February 26, 2024
person dharshininews
పేదలకు అండగా వైశ్య ఫెడరేషన్
పేదలకు అండగా వైశ్య ఫెడరేషన్ - సహాయం అందించేందుకు సంసిద్ధం - ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త - అట్టహాసంగా జిల్లా, తాండూరు పట్టణ కార్యవర్గ ప్రమాణ స్వీకారం - పేదలకు పుస్తెమెట్టెలు, కుట్టు మిషన్లు, దుస్తుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదలను ఆదుకునేందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) అండగా ఉంటుందని ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐవీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్, కార్యవర్గం, తాండూరు పట్టణ కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి హాజరయ్యారు. జిల్లా, పట్టణ కార్యవర్గం చేత శ్రీనివాస్ గుప్త ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైశ్య ఫెడరేషన్ తరుపున రెండు పేదింటి పెళ్లిళ్లకు పుస్తె, మెట్టెలు, కొత్త బట్టలను బహుకరించారు. అదేవిధంగా వేముల సురేందర్ సహాకారంతో తాండూరు మండలంలోని బాస్పల్లి గ్రామానికి చెందిన నిరు పేద మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. రొంపల్లి సంతోష్ కుమార్ సహాకారంతో పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలోని హైస్కూల్ కు సీలింగ్ ఫ్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల సల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ పేదలకు అండగా నిలించేలా ఐవిఎఫ్ సేవలను అందిస్తుందన్నారు. కష్టాల్లో, ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ఐవీఎఫ్ సంసిద్ధంగా ఉంటుందన్నారు. జిల్లా, తాండూరు పట్టణ కార్యవర్గం ఈ సేవా సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ సామాజిక సేవలో ఐవీఎఫ్ అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, అడ్వయిజర్ కటకం శ్రీసు, యూత్ అధ్యక్షులు కట్ట రవి, కోశాధికారి కొల్పూరి నరేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, జనగామ అధ్యక్షులు బిజ్జుల నవీన్, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, మహిళ విభాగ్ కార్యదర్శి లెంకెలపల్లి మంజుల, రాష్ట్ర నాయకులు ఎంపీటీసీ దేవగారి రాములు, కౌన్సిలర్ సాహు శ్రీలత, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోట మురళీకృస్న పోటీ మహరాజ్ దేవాలయ చైర్మన్ భాను, మహిళ సంఘం అధ్యక్షురాలు కల్వ సరిత, ఐవీఎఫ్ అధ్యక్షులు ప్రవీణ్, వాసవీ క్లబ్ అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం ఇదే జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు మోముల రాజ్ కుమార్, దోమ శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి కల్వ శేషాద్రి ఉప కార్యదర్శి మోముల హరీష్ కుమార్ కోశాధికారి ఆగీరు మహేష్ కుమార్ తాండూరు పట్టణ అధ్యక్షులు కల్వ జగదీశ్వర్ ఉపాధ్యక్షులు పోల వంశీ ప్రధాన కార్యదర్శి గుడుపల్లి ప్రణయ్ చంద్ర ఉప కార్యదర్శి మంకాల రఘురాం కోశాధికారి కల్వ సాయితేజ ఇది కూడా చదవండి.. https://dharshininews.com/24154/