schedule Sunday, July 05, 2026

పార్కింగ్ చేసిన కారు చోరీ

calendar_today March 7, 2024
person dharshininews
పార్కింగ్ చేసిన కారు చోరీ
పార్కింగ్ చేసిన కారు చోరీ - 12 గంటల్లో చేధించిన పోలీసులు - తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారును గుర్తుతెలియని వ్యక్తి చోరి చేసి అందులో పరారయ్యాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును పట్టుకున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు మండలం చెన్ గెష్‌పూర్ గ్రామానికి చెందిన బంటు అంజిలయ్య బుధవారం రాత్రి తన సిప్ట్ డిజైర్ కారు(టీఎస్ 34డీ 9206)ను పట్టణంలోని సావుకార్‌ పేట్‌లో ఉన్న ఎస్బీఐ మేయిన్ బ్రాంచ్ వద్ద పార్క్ చేశారు. అక్కడి నుంచి దగ్గర్లో ఉన్న ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. కొద్ది సేపటికి వచ్చి చూసే సరికి పార్కింగ్ చేసిన కారు కనిపించలేదు. దీంతో అదేరాత్రి 10 గంటల ప్రాంతంలో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా కారు ఏయే ప్రాంతాల్లో తిరిగిందని పరిశీలించారు. గురువారం ఉదయం దొంగలించిన కారు కోకట్ రోడ్డు మార్గంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారును అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఫిర్యాదు స్వీకరించిన 12 గంటల్లోనే పోలీసులు దొంగలించిన కారును అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇదికూడా చదవండి... https://dharshininews.com/24297/