schedule Saturday, July 04, 2026

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..!

calendar_today March 15, 2024
person dharshininews
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..!
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..! - అదుపులోకి తీసుకున్న ఈడీ - రెండు, మరో 16 ఫోన్లు సీజ్ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలసిందే. సోదాల అనంతరం అరెస్టు పరిణామం చోటు చేసుకుంది. సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాని ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు పలువురు భారాస నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు కవిత నివాసం వద్దకు భారాస కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు..ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు రాత్రి 8.45 ఫ్లైట్ బుక్ చేశారు. లోకల్ యాడ్... ఇది కూడా చదవండి... https://www.dharshininews.com/24400/