schedule Tuesday, September 15, 2026

విద్యతోనే భవిష్యత్తు..!

calendar_today April 16, 2024
person dharshininews
విద్యతోనే భవిష్యత్తు..!
విద్యతోనే భవిష్యత్తు..! - మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య - సెయింట్ మేరీలో ఘనంగా గ్రాడ్యూయేషన్ డే తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యతోనే అందరికి ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మేరీ స్కూల్లో చిన్నారులతో గ్రాడ్యూయేషన్ డే నిర్వ వాంచారు. ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళుతున్న విద్యార్థులకు కోట్రిక విజయలక్ష్మీ చేతుల మీదుగా పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు చదువుపై దృష్టి పెట్టాలన్నారు. చక్కగా చదువుకుంటేనే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందన్నారు. వేసవి లో సెలవులను వృథా చేయరాదని, విద్యకు అవసరమయ్యే ఏదో దానికి శ్రద్ద పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25614/