schedule Tuesday, September 15, 2026

శభాష్‌.. అష్పాక్...!

calendar_today April 20, 2024
person dharshininews
శభాష్‌.. అష్పాక్...!
శభాష్‌.. అష్పాక్...! - యూపీఎస్సీ ర్యాంకర్‌కు సన్మానం - అభినందించిన జమియతే ఉలేమా తాండూరు, దర్శిని ప్రతినిధి : శబ్బాష్ .. అష్పాక్..! అంటూ ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ర్యాంకర్ ను తాండూరు ముస్లిం సంఘాల ప్రతినిధులు అభినందించారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గొట్లపల్లికి చెందిన జబ్బార్ కుమారుడు అష్పాక్ ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 770 ర్యాంకు సాధించాడు. తాండూరుకు చెందిన యువకుడు అష్పాక్ సివిల్స్ ర్యాంకు సాధించడంతో శనివారం స్థానిక ముస్లిం సంఘాల ప్రతినిధులు సన్మానించారు. పట్టణంలోని జమియతే ఉలేమా జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ అర్హర్ ఖాస్మీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యతరగతి కుటుంబానికి చెందిన అష్పాక్ యూపీఎస్సీలో ర్యాంకు సాధించడం తాండూరుకు గర్వకారణమన్నారు. రానున్న కాలంలో ఉజ్వలమైన భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హఫీజ్ అబ్దుల్ సలాం. హఫీజ్, మక్బూల్ అహ్మద్, హఫీజ్ రైసుద్దీన్, సయ్యద్ ఫిరాసత్ అలీ ఖాస్మి, మౌలానా అజహరుద్దీన్ ఖాస్మి, మౌలానా మహమ్మద్ అలీ ఖాస్మీ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/25683/