schedule Saturday, September 12, 2026

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

calendar_today April 26, 2024
person dharshininews
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం - తాండూరు అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తాం - చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు తాండూరు అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు మీడియాతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు, వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. దీంతో పాటు తాండూరు అభివృద్ధిపై దృష్టిసారిస్తామన్నారు. తాండూరులో పాలిటెక్నిక్ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రి, తాండూరు - కోడంగల్ మద్యలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. మన్నెగూడ నాలుగులైన్ల రోడ్డు పూర్తయ్యేలా చూస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మెజార్టీ అందిస్తే ఐదేండ్లు తాండూరు అభివృద్ధితో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గంలోని వివిధ పత్రికల ఇంచార్జులు, టౌన్, మండల జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25762/