schedule Saturday, September 12, 2026

అక్షర స్పూర్తి మా నవ్యరెడ్డి..!

calendar_today May 21, 2024
person dharshininews
అక్షర స్పూర్తి మా నవ్యరెడ్డి..!
అక్షర స్పూర్తి మా నవ్యరెడ్డి..! - స్టేట్‌ ర్యాంకర్‌కు అభినందనలు - సన్మానించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శని ప్రతినిధి : చదివిన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని చెప్పే మాటలను మా అక్షర కాన్సెఫ్ట్ స్కూల్ పూర్వ విద్యార్థినిని నవ్యరెడ్డి నిజం చేసిందని స్కూల్ యాజమన్యం కొనియాడారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఈఏపీసెట్‌లో అక్షర కాన్సెఫ్ట్ స్కూల్‌లో చదివిన నవ్యరెడ్డి రాష్ట్ర స్థాయిలో 864వ ర్యాంకు సాధించింది. యలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన పి. శ్రీనివాస్ రెడ్డి కూతురు నవ్యరెడ్డి అక్షర కాన్సెఫ్ట్ లో పదో తరగతి చదవింది. స్కూల్లో కూడా టాపర్‌గా నిలించింది. ఈఏపీసెట్‌లో నవ్యరెడ్డి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల మంగళవారం స్కూల్ యాజమాన్యం నవ్యరెడ్డికి సన్మానం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ గౌడ్, టీచర్లు మాట్లాడుతూ చదివిన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని చెప్పే మాటలను మా అక్షర కాన్సెఫ్ట్ స్కూల్ పూర్వ విద్యార్థినిని నవ్యరెడ్డి నిజం చేసిందని కొనియాడారు. నవ్యరెడ్డి అక్షర స్కూల్‌కు స్పూర్తిగా నిలిచిందన్నారు. నవ్యరెడ్డి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు ఎండీ యూనుస్, సీకే ప్రవీణ్‌ కుమార్, శ్రీకాంత్, రవీందర్, తల్లిదండ్రులు సిబ్బంది ఉన్నారు. ఇదికూడ చదవండి...   https://www.dharshininews.com/26567/