schedule Saturday, September 12, 2026

వాహ్‌.. వైష్ణవి..!

calendar_today May 21, 2024
person dharshininews
వాహ్‌.. వైష్ణవి..!
వాహ్‌.. వైష్ణవి..! - ఈఏపీసెట్‌లో 413వ ర్యాంకు - అయినా నీట్‌ ర్యాంకుపైనే గురి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంలో అమ్మాయిలు దూసుకపోతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యుత్తుమ ర్యాంకులు సాధించి ఔరా అనిపిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన విద్యార్థిని కూడా వాహ్.. అనిపించుకుంది. ఈఏపీసెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినా కూడా తన లక్ష్యం వేరే ఉందంటూ.. దానిపై సూటిగా గురిపెట్టానని చెబుతోంది. అ అమ్మాయి ఎవరో.. తన లక్ష్యం ఏమిటో తన మాటల్లోనే తెలుసుకుంది. బషీరాబాద్‌ మండలానికి చెందిన ఎస్‌జీ శివకుమార్, అన్నపూర్ణల కూతురు ఎస్‌జీ వైష్ణవి. కుటుంబంతో వారు తాండూరు పట్టణంలోని గ్రీన్‌ సిటీ కాలనీలో ఉంటున్నారు. ప్రాథమిక విద్యను బషీరాబాద్‌లో అభ్యసించిన వైష్ణవి 7 నుంచి 10వ తరగతి తాండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌లో చదివింది. ఇంటర్‌ విద్య హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో పూర్తి చేసింది. ఇటీవల ఈఏపీసెట్‌ పరీక్షలు రాసింది. విడుదలై పరీక్షా ఫలితాల్లో ఆమె రాష్ట్ర స్థాయిలో 413వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులతో పాటు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యజమాన్యం వైష్ణవిని అభినందించారు. మరోవైపు వైష్ణవి మాట్లాడుతూ ఈఏపీసెట్‌లో తనకు 413వ వచ్చినప్పటికి తాను నీట్‌లో ర్యాంకు సాధించడమే తన లక్ష్యమని పేర్కింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26655/