schedule Saturday, September 12, 2026

ఆధునాతన పద్దతులతో అధిక దిగుబడులు

calendar_today May 24, 2024
person dharshininews
ఆధునాతన పద్దతులతో అధిక దిగుబడులు
ఆధునాతన పద్దతులతో అధిక దిగుబడులు - నాణ్యమైన విత్తనాలపై అవగాహన పెంచుకోవాలి - కందిసాగులో యజమాన్య పద్ధతులు అవసరం - తాండూరు వ్యవసాయ స్థానం ప్రధాన శాస్త్ర వేత్త డా.సుధారాణి - పరిశోధనా స్థానంలో ఘనంగా విత్తన మేళ తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు ఆధునాతన పద్దతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్ర వేత్త డా.సీ. సుధారాణి అన్నారు. శుక్రవారం పరిశోధనా స్థానంలో విత్తన మేళ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్ర వేత్తలు డా.సీ.సుధారాణి, డా.సీ. సుధాకర్ లు మాట్లాడుతూ వివిధ పంటల సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధునాతన పద్ధతులతో పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు కంది, పెసర, మినుము పంటల్లో సమగ్ర యజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు. తాండూరులో పండిస్తున్న కందికి జీఐ(భౌగోళిక గుర్తింపు) రావడంతో డిమాండ్ పెరిగిందన్నారు. కందిబోర్డు ఏర్పాటైతే మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు శాస్త్ర వేత్తలు నూతన వంగడాలు, కంది, మినుము, పెసర, సోయాచిక్కుడు, కొర్రలు తదితర పంటల సాగులో అధిక దిగుబడులపై సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం పరిశోధన స్థానం నుంచి రూపొందించిన తెలంగాణ కంది-3(టీడీఆర్టీ-59), ఆశ(ఐసీపీఎల్-87119) రకాల విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్ర వేత్తలు డా. సుజాత, యమున, డా. కే. శేఖర్, డా. రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26700/