schedule Saturday, September 12, 2026

ఆత్మ విశ్వాసంతో సిద్దం కండి..!

calendar_today May 31, 2024
person dharshininews
ఆత్మ విశ్వాసంతో సిద్దం కండి..!
chai jrఆత్మ విశ్వాసంతో సిద్దం కండి..! - ఫేయిల్‌ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించాలి - మీ విజయం కోసమే ఉచిత విద్యాభోధన - భాష్యం కళాశాల కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మ విశ్వాసంతో విద్యార్థులు పరీక్షలకు సిద్దం కావాలని తాండూరు భాష్యం కాలేజీ కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ అన్నారు. భాష్యం జూనియర్ కళాశాలలో గత 30రోజులుగా నిష్ఠ ఫౌండేషన్, సేవ భారతి ఆధ్వర్యంలో పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు. శనివారం ఈ తరగతుల ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండంట్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ ఓటమే గెలుపుకు నాంది అని, ఫెయిల్ అయ్యాం అని బాధపడకుండా ఉపాధ్యాయులు చెప్పిన సూచనల ప్రకారం తప్పులు సరిదిద్దుకొని పరీక్షల్లో అధిక మార్కులు తెచ్చుకొని భవిష్యత్తు పై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి,ఫెయిల్ కావడం తప్పు కాదని మళ్ళీ పాస్ కావడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం తప్పు అని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని, అంకితభావంతో క్లాసులు బోధించిన ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భాష్యం కళాశాల డైరెక్టర్ అనురాధ రమేష్ మాట్లాడుతూ ఫెయిల్ అయ్యాం అని బాధపడకుండా విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు అనుగుణంగా ఇష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉచిత తరగతుల ఇంచార్జి రామచందర్, అధ్యాపకులు మల్లికార్జున్, వెంకట్, జగదీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26878/