schedule Tuesday, September 15, 2026

'నీట్‌'గా గురిపెట్టింది...!

calendar_today June 5, 2024
person dharshininews
'నీట్‌'గా గురిపెట్టింది...!
chai jr 'నీట్‌'గా గురిపెట్టింది...! - అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వైష్ణవి - ర్యాంకు సాధించిన తాండూరు విద్యార్థి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇటీవలే విడుదలైన ఈఏపీసెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినా కూడా తన లక్ష్యం నీట్‌పైనే చెప్పి అనుకున్న లక్ష్యానికి గురిపెట్టి సాధించింది తాండూరు విద్యార్థిని. 99శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్‌ మండలానికి చెందిన ఎస్‌జీ శివకుమార్, అన్నపూర్ణల కూతురు ఎస్‌జీ వైష్ణవి. కుటుంబంతో వారు తాండూరు పట్టణంలోని గ్రీన్‌ సిటీ కాలనీలో ఉంటున్నారు. ప్రాథమిక విద్యను బషీరాబాద్‌లో అభ్యసించిన వైష్ణవి 7 నుంచి 10వ తరగతి తాండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌లో చదివింది. ఇంటర్‌ విద్య హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో పూర్తి చేసింది. ఇటీవల రాసిన ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఆమె రాష్ట్ర స్థాయిలో 413వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఈఏపీసెట్‌లో తనకు 413వ వచ్చినప్పటికి తాను నీట్‌లో ర్యాంకు సాధించడమే తన లక్ష్యమని పేర్కింది. అనుకున్నట్లుగానే మంగళవారం విడుదలైన నీట్ పరీక్షా ఫలితాల్లో వైష్ణవి 720 మార్కులకు గాను 690 మార్కులు(99.7శాతం) సాధించి ఓబీసీ కేటగిరి 1629 ర్యాంకు సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వైష్ణవిని తల్లిదండ్రులతో పాటు స్కూళ్లు, కాలేజీల టీచర్స్, లెక్చరర్స్‌ అభినందనలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26992/