schedule Saturday, September 12, 2026

వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బదిలీ

calendar_today June 17, 2024
person dharshininews
వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బదిలీ
chai jr వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బదిలీ - జిల్లా కొత్త ఎస్పీగా నారాయణ రెడ్డి - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్‌లో వికారాబాద్‌ జిల్లా ఎస్పీగా నంద్యాల కోటిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. సోమవారం ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులలో ఆయన స్థాన చలనం కల్పించారు. మేడ్చల్‌ జోన్ డీసీపి నితికా పంత్‌ స్థానంకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా వికారాబాద్‌ జిల్లా కొత్త ఎస్పీగా కె. నారాయణ రెడ్డిని నియమించారు.శంషాబాద్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనను వికారాబాద్‌ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లాలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి జిల్లాలో త‌న‌దైన ముద్ర వేశారు. నిషేధిత గుట్కా ర‌వాణా, అక్ర‌మ ఇసుక ర‌వాణాపై ఉక్కుపాదం మోపారు. టాస్క్‌ఫోర్స్‌ను ప్ర‌వేశ పెట్టి గుడుంబా, గంజాయి సాగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27239/