schedule Friday, September 11, 2026

విద్యతో పాటు ఉద్యోగవకాశాలను పొందాలి

calendar_today June 26, 2024
person dharshininews
విద్యతో పాటు ఉద్యోగవకాశాలను పొందాలి
chai jrవిద్యతో పాటు ఉద్యోగవకాశాలను పొందాలి - పీపుల్స్ కాలేజీలో ప్లేస్ మెంట్ సెల్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని తాండూరు సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లేస్ మెంట్ సెల్, కేరీర్ కౌన్సిలింగ్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం పీపుల్స్ కాలేజీలో పేస్ మెంట్ సెల్, కేరీర్ కౌన్సిలింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆదర్శనీయమన్నారు. విద్యతో పాటు ఉద్యోగ అవకాశాల పట్ల విద్యార్థులను చైతన్య పరచడం పట్ల వారు ఉద్యోగ అవకాశాలను సాధించుకోవడంలో నైపుణ్యతను మెరుగు పరుచుకుంటారని అన్నారు. చదువు కోవడమే కాకుండా ఈ కేంద్రం ద్వారా అందించే ఉద్యోగ అవకాశాలను సద్వనియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇలాంటి కేంద్రాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారుతాయన్నారు. ఈ అవకాశాన్ని యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ కాలేజీ ప్రిన్సిపల్ సత్యానంద్, చంద్రకళ, నాగేశ్వర చారీ, రవీందర్ రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27421/