schedule Friday, September 11, 2026

స్వయం ఉపాధిలో దూసుకపోవాలి

calendar_today June 26, 2024
person dharshininews
స్వయం ఉపాధిలో దూసుకపోవాలి
chai jrస్వయం ఉపాధిలో దూసుకపోవాలి - ఉన్నంతంగా ఎదిగేందుకు తోడ్పాటు - టీయూడబ్ల్యూ అధ్యక్షులు అశోక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుత తరుణంలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి రంగంలో దూసుకపోవాలని టీయూడబ్ల్యూజే తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు జీ.అశోక్ కుమార్ అన్నారు. తాండూరు ప్రాంతానికి చెందిన బోయిని రాజు, ప్రవీణ్ కుమార్‌లు సొంతగా హాట్‌ అండ్ కోల్డ్ టీ, ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం టీయూడబ్ల్యూజే అధ్యక్షులు జీ.అశోక్ కుమార్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత స్వయం ఉపాధి రంగంలో రాణించేందుకు దృష్టిసారించడం అభినందనీయమన్నారు. ఉద్యోగ అవకాశాలు లేని యువత సెల్ప్‌ ఎంప్లాయిమెంట్‌ను ఎంచుకోవడం వల్ల వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్న యువత స్వశక్తితో అనుకున్నది సాధించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శివశంకర్ ,కుమార్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27423/