ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న అమ్మాయిలు
October 19, 2021
dharshininews
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న అమ్మాయిలు
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో తిరుగు పయనం
దర్శని బ్యూరో : భారీ వర్షాలు, వరదలకు వణికిపోతున్నాయి కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల ధాటికి కేరళలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఈ ఉత్తరాఖండ్ వరదల్లో దసరా సెలవులకని వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం. మల్కాజిగిరి ఆర్.కె.నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. అకస్మాత్తుగా అక్కడ వరదలు ముంచెత్తడంతో గత నాలుగు రోజులుగా అక్కడ లేమన్ ట్రీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. అక్కడ తాము ఒక బిల్డింగ్ మూడవ అంతస్తుపై చిక్కుపోయామని..రెండవ అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో తాము ఉన్నట్లు బాధితులు విచారం వ్యక్తం చేశారు. తమను కాపాదాటానికి ఎవరు ఇక్కడ అధికారులు రావడంలేదని వాపోయారు. తమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎంఓకు ట్విట్ ద్వారా కోరారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వెంటనే ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పందించిన ఉత్తరాఖండ్ అధికారులు.. హైదరాబాదీ యువతులను కాపాడే చర్యలు తీసుకున్నారు. లేమన్ ట్రీ ప్రాంతంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో వరదల్లో చిక్కుకున్న సుష్మ మిత్రబృందం దగ్గరకు వెళ్లి సహాయ బృందాలు కాపాడాయి. దీంతో తమ వాహనంలో సుష్మ, ఆమె స్నేహితులు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తమను కాపాడేందుకు చర్యలు తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.
https://twitter.com/kishanreddybjp/status/1450407614169321473?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1450407614169321473%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftelangana%2Fhyderabad-malkajgiri-young-women-trapped-in-uttarakhand-floods-are-rescued-with-help-of-kishan-reddy-560848.html