schedule Sunday, September 13, 2026

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు

calendar_today July 31, 2024
person dharshininews
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు - 18వ తేది వరకు చేరికకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తాండూరు పీపుల్స్ డీగ్రీ కాలేజీ కోఆర్డీఓనేటర్ నాగేశ్వర్ చారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరికకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అయిన వారు ఓపెన్ డిగ్రీలో చేరవచ్చన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీలో ఆన్‌లైన్ చేరవచ్చన్నారు. ఆగస్టు 18వ తేది వరకు అడ్మిషన్లు చేరేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఓపెన్ డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించేంందుకు 18వ తేదిలోపు గడువు ఉంటున్నారు. పూర్తి వివరాలకు పీపుల్స్ కాలేజీలోని స్టడీ సెంటర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.