schedule Sunday, July 05, 2026

స్వయం ఉపాధిలో రాణించాలి

calendar_today August 7, 2024
person dharshininews
స్వయం ఉపాధిలో రాణించాలి
స్వయం ఉపాధిలో రాణించాలి - కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ - వార్డులో ఆధార్, పాన్ కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని తాండూరు మున్సిపల్ 25వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. బుధవారం తన వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పాన్, ఆధార్, జిరాక్స్ సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతతో పాటు చదువుకున్న నిరుద్యోగులు స్వయం ఉపాధి రంగాల వైపు మొగ్గుచూపాలన్నారు. స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభించిన కేంద్రం నిర్వహకులకు అన్ని లాభాలు చేకూరాలని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహకులు ప్రభాకర్ గౌడ్ తో పాటు పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, జలాల్, సమద్, జర్నప్ప తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28116/