schedule Saturday, September 12, 2026

మోడల్‌ స్కూల్లో పోస్టులు..!

calendar_today August 9, 2024
person dharshininews
మోడల్‌ స్కూల్లో పోస్టులు..!
మోడల్‌ స్కూల్లో పోస్టులు..! - భర్తి కోసం దరఖాస్తులు ఆహ్వానం - చివరి గడువు ఎప్పటి వరకంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మాడల్‌ స్కూల్లో పలు పోస్టులు భర్తికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ మేరకు మండల విద్యాధికారి పోస్టుల భర్తి కోసం దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మాడల్‌ స్కూల్లో హెడ్ కూక్(ప్రధాన వంటవాడు), అసిస్టెంట్ కూక్(సహాయకుడు), నైట్ వాచ్ మెన్ పోస్టులను భర్తి చేసేందుకు దరఖాస్తులు కోరడం జరుగుతుందని వెల్లడించారు. ప్రధాన వంటవాడి కోసం పదో తరగతి, సహాయకుడు కోసం 7వ తరగతి, నైట్‌ వాచ్‌ మెన్‌ కోసం పదో తరగతి ఉత్తీర్ణులు అయిన వారు అర్హులని స్పష్టం చేశారు. వంటవాళ్లకు అనుభవం ఉండాలని, నైట్‌ వాచ్‌ మెన్‌కు సెక్యూరీటీ ఎజెన్సీలో శిక్షణ పొందిఉంటేనే ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హతగల వారు ఈనెల 16వ తేదిలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28143/