schedule Sunday, July 05, 2026

చదువున్న పాఠశాలపై మమకారం..!

calendar_today August 13, 2024
person dharshininews
చదువున్న పాఠశాలపై మమకారం..!
చదువున్న పాఠశాలపై మమకారం..! - స్కూల్ కు మైక్ సెట్ అందించిన టీచర్ - అభినందించిన పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చిన్నతనంలో తాను చదువుకున్న పాఠశాల పై ఓ టీచర్ మమకారం చాటుకుంది. అదే పాఠశాలలో విద్యార్థుల కోసం చిరు సాయంగా మైకు సెట్ ను అందజేసింది. ఈ సంఘటన మంగళవారం చిట్టిగణాపూర్ పాఠశాలలో జరిగింది. తాండూరు మండలం కరణ్ కోట్ లోని వడ్డెర బస్తీలో అనూష ఉపాధ్యాయులుగా పనిచేసింది. ఇటీవల జరిగిన బదిలీలలో ఆమె ఇందూరు గ్రామ పాఠశాలకు బదిలీపై వెళ్లింది. ఈ క్రమంలో తాను చిన్నతనంలో విద్యనభ్యసించిన తాండూరు మండలం చిట్టిగణాపూర్ ప్రాథమిక పాఠశాలకు తన సొంత ఖర్చులు రూ. 6వేలతో మినీ మైకు సెట్ ను మంగళవారం బహుకరించింది. ఆమె తన సోదరుడు మల్లికార్జున్ పటేల్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డికి అందజేసింది. చదువుకున్న పాఠశాలకు తన వంతు సాయం అందజేసిన టీచర్ అనుషను ప్రధానోపాధ్యాయుడు నర్సిరెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు ప్రమోద్, శశివర్ణ, నర్సింలు, అనంతప్ప తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28325/