schedule Friday, September 11, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

calendar_today September 6, 2024
person dharshininews
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం - సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ - తాండూరులో బాధ్యతల స్వీకరణ తాండూరు, దర్శినిప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాండూరు సబ్ కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆర్డీఓ కార్యాలయ స్థాయిని సబ్ కలెక్టర్ స్థాయిగా మార్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన శ్రీనివాస్ రావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు తాండూరు సబ్‌ కలెక్టర్ గా ఉమాశంకర్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు డివిజన్‌లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. పరిపాలన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. శాఖపరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అంతకుముందు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌కు కార్యాలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28764/