schedule Tuesday, September 08, 2026

ఏడ్చేందుకు క్రైయింగ్ రూమ్స్

calendar_today October 22, 2021
person dharshininews
ఏడ్చేందుకు క్రైయింగ్ రూమ్స్
ఏడ్చేందుకు క్రైయింగ్ రూమ్స్ - కొత్త సంస్కృతికి తెర‌లేపిన స్పెయిన్ - ఎందుకోస‌మంటే..? ద‌ర్శ‌ని బ్యూరో : ఎవ‌రైనా న‌లుగురిలో న‌వ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు కాని, ఏడ్చేందుకు ఎవ్వ‌రు ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే నవ్వుకు ఉన్న పాజిటివ్‌నెస్‌ ఏడుపునకు ఉండదు. నవ్వితే ఎవరూ తప్పు పట్టరు కానీ ఏడిస్తే మాత్రం ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తుంటారు. మనసారా నవ్వితే ఎంత హాయిగా ఉంటుందో.. ఏడిస్తే కూడా అలాంటి భావనే కలుగుతుంది. మనసులోని బాధలు కన్నీటి రూపంలో బయటకు పోతే మనసు తేలిక పడుతుంది. అయితే నలుగురిలో ఏడిస్తే ఏమనుకుంటారో అని నాలుగు గోడల మధ్య ఏడుస్తుంటారు. ఈ సంస్కృతికి చెరిపేస్తూ కొత్త సంస్కృతికి తెర‌లేపాయి స్పెయిన్ ప్ర‌భుత్వం. 2019లో స్పెయిన్‌లో ఏకంగా 3,671 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. స్పెయిన్‌ జనాభాలో దాదాపు 5.8 శాతం మంది ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారని అలాంటి వారి కోసమే ఈ క్రైయింగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు అక్క‌డి ప్ర‌భుత్వ అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ఈ ‘క్రైయింగ్‌ రూం’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒత్తిడి, ఆందోళన సమస్యలను ఎదుర్కొంటున్న వారు సమస్యల నుంచి బయటపడడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. సెంట్రల్‌ మాడ్రిడ్‌లో ఏర్పాటు చేసిన ఈ గదుల్లో ఎప్పుడూ మానసిక వైద్యులు అందుబాటులో ఉంటారు.