schedule Friday, September 11, 2026

గణేష్ పండగను సంతోషంగా జరుపుకోవాలి

calendar_today September 7, 2024
person dharshininews
గణేష్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
గణేష్ పండగను సంతోషంగా జరుపుకోవాలి - హిందూ ఉత్సవ సమితి తమవంతు సహాకారం - ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - తాండూరులో వినాయకులకు ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం వినాయక చవతి సందర్భంగా తాండూరులో ప్రతిష్టించిన వినాయకులను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయకునికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తొలిపూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 25ఏండ్లుగా భద్రేశ్వర చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయకునికి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరు భక్తి శ్రద్ధలతో వినాయకున్ని ప్రతిష్టించి పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అదేవిధంగా తాండూరు హిందూ ఉత్సవ సమితికి గతంలో స్థలం, నిధులు కేటాయించడం జరిగిందని గుర్తుచేశారు. మునుముందు కూడా హిందూ ఉత్సవ సమితికి తమవంతు సహాకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ పరిమళ, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, హరిగౌడ్, తంబాకు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, కోశాధికారి తర్లపల్లిలి భాను కుమార్, సభ్యులు పరమేష్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింహా, ఎర్రం వసంత్, అశోక్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28799/