schedule Monday, September 14, 2026

మృతుని కుటుంబానికి నేతల చేయూత

calendar_today September 8, 2024
person dharshininews
మృతుని కుటుంబానికి నేతల చేయూత
మృతుని కుటుంబానికి నేతల చేయూత - ఆర్థిక సాయం అందజేసిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ మృతుని కుటుంబానికి తాండూరు కాంగ్రెస్ నాయకులు చేయూతనందించారు. పెద్దేముల్ మండలం హన్మపూర్ గ్రామానికి చెందిన బక్కని పార్వతప్ప మృతి చెందారు. ఆదివారం ఈ విషయం తెలుసుకున్నకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాంచెందర్ కూడా కుటుంబానికి తనవంతు సాయం అందజేశారు. సాయం అందించిన నేతలకు మృతురాలి కుటుంభీకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతుని భార్య నాగమ్మ, కుమారుడు చంద్రమౌళి, గ్రామానికి చెందిన లొంకరాములు, పి.శ్రీనివాస్, బక్కని విజయ్, బక్కనీ సంజీవ్ లు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28840/