schedule Sunday, September 13, 2026

నిరుద్యోగులకు శుభవార్త..!

calendar_today September 9, 2024
person dharshininews
నిరుద్యోగులకు శుభవార్త..!
నిరుద్యోగులకు శుభవార్త..! - డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల ఆహ్వానం - తుది గడువు ఎప్పటి వరకు అంటే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఏ. వంసత కుమారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్-1, తెలుగు-1, వాణిజ్య శాస్త్రం ఇంగ్లీష్‌ మీడియంలో-1, ఉర్దూమీడియంలో మరొక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలని, పీహెచ్/ఎస్ఈటీ/ఎస్ఈటీ కలిగి ఉన్నవారి ప్రాధాన్యత ఉంటుందన్నారు. బోధన అనుభవం ఉన్న వారు సర్వీసెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు రేపు అనగా 10వ తేది మంగళవారం సాయంత్రం 4గంటలలోపు కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28872/