schedule Sunday, July 05, 2026

గురుకులాల్లో పార్ట్ టైం జాబ్‌లు..!

calendar_today October 5, 2024
person dharshininews
గురుకులాల్లో పార్ట్ టైం జాబ్‌లు..!
గురుకులాల్లో పార్ట్ టైం జాబ్‌లు..! - అభ్యర్థుల నుంచి దరకాస్తుల ఆహ్వానం - గడువు, అర్హతలు ఏవంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని గురుకులాల్లో పార్ట్ జాబ్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. శనివారం గిరిజిన సంక్షేమ శాఖ నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో పలు సబ్జెక్టులను బోధించేందుకు పార్ట్ టైం జాబ్‌లకు దరఖాస్తులను కోరుతున్నట్లు వికారాబాద్ జిల్లా రీజినల్ కోఆర్డీనేటర్ తెలిపారు. జిల్లాలోని కుల్కచర్ల, కోడంగల్, తాండూరులలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. తాండూరులోని బాలికల పాఠశాలల్లో కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను కోడంగల్ లోని గిరిజన సంక్షేమ పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 21న జరిగే డెమో, ఇంటర్వూలకు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని మానస హిల్స్‌ ఐఐటీ స్టడీ సెంటర్‌లో ఉన్న రీజినల్ కోఆర్డీనేటర్ కార్యాలయంలో ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ : 9490957326కు సంప్రదించాలని తెలిపారు. పార్ట్ టైం జాబ్‌లు కింద లిస్టులో చూడండి.. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29531/