schedule Friday, September 11, 2026

నిరంతర సాధనతో ఏదైనా సాధ్యమే..!

calendar_today October 5, 2024
person dharshininews
నిరంతర సాధనతో ఏదైనా సాధ్యమే..!
నిరంతర సాధనతో ఏదైనా సాధ్యమే..! - మెరుగైన బోధన భాష్యంకే సొంతం - భాష్యం కాలేజీ కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ - ఉత్సహంగా కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరంతరం సాధన చేయడం వల్ల అనుకున్నది ఏదైనా సాధించడం సాధ్యమవుతుందని తాండూరు భాష్యం జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలను సంకల్ప్ - 2024 పేరుతో ఉత్సహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు కోసం నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వాటి కోసం నిరంతరం సాధన చేయడం వల్ల సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం అలవర్చుకోవాలన్నారు. అదేవిధంగా కాలేజీ అధ్యక్షురాలు అనురాధ రమేష్ మాట్లాడుతూ మెరుగైన బోధనతో ఉత్తమ ఫలితాలు సాధించడం భాష్యం కాలేజీకే సొంతమన్నారు. గత ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం కాలేజీ కృషి చేస్తుందన్నారు. ప్రిన్సిపల్ సోమనాథ్ మాట్లాడుతూ విద్యార్థులను తమ లక్ష్యాల కోసం కష్టపడి చదుకోవాలన్నారు. మరోవైపు సంకల్ప్ - 2024లో భాగంగా విద్యార్థులు ఉత్సహంగా వేడుకలు జరుపుకున్నారు. నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడామిక్ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, అధ్యాపకులు వెంకట్ రెడ్డి, మల్లికార్జున్, గోవర్దన్ రెడ్డి, ప్రవీణ, సుప్రజ, పూర్ణిమ, అఖిల. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29539/