schedule Saturday, July 04, 2026

మూడో ఫ‌న్ ఫిక్స‌య్యింది

calendar_today October 24, 2021
person dharshininews
మూడో ఫ‌న్ ఫిక్స‌య్యింది
మూడో ఫ‌న్ ఫిక్స‌య్యింది - వ‌చ్చే యేడాది ఫిబ్ర‌వ‌రికి ఎఫ్3 ద‌ర్శిని సినిమా : విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 సంచలన విజయం విష‌యం తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా నిర్మిస్తున్న ఎఫ్3 రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా, సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీని 2022, ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.