schedule Friday, September 11, 2026

పైలెట్‌కు పట్నం భయం..!

calendar_today October 11, 2024
person dharshininews
పైలెట్‌కు పట్నం భయం..!
పైలెట్‌కు పట్నం భయం..! - సత్తా ఉన్నందుకే చీఫ్ విఫ్‌ పదవి - మహేందర్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు - ఆట ముగింసింది.. ఎవరిదో అందరికి తెలుసు - కాంగ్రెస్ యువనాయకులు బిర్కడ్‌ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ చీఫ్‌ విఫ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అంటే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డికి భయం పట్టుకున్నట్లుగా ఉందని కాంగ్రెస్ పార్టీ తాండూరు 20వ వార్డు సభ్యులు బిర్కడ్‌ రఘు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చీఫ్‌ విఫ్‌ మహేందర్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. మహేందర్ రెడ్డి ఖేల్‌ ఖతం అయ్యిందని చేసిన విమర్శకు రోహిత్ రెడ్డి పనైపోయినందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను శాసించే సత్తా ఉన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించిందని గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహేందర్ రెడ్డి సేవలు అవసరమని ఆయనకు తెలంగాణ చీఫ్‌ విఫ్‌ పదవిని అప్పగించిందన్నారు. పదవులు ఉన్నా లేకున్నా మహేందర్ రెడ్డి, ఆయన కుటుంబం ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఆదరణ ఎప్పటీకి తగ్గదని అన్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత పార్టీపై దృష్టి సారించకుండా సొంత పనులు చేసుకుంటున్న రోహిత్ రెడ్డి గ్రాఫ్‌ పడిపోయిందన్నారు. ఆట ముగిసిందన్న సంగతికి అందరికి తెలుసని అన్నారు. మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత ఆయనకు లేదన్నారు. మరోసారి మహేందర్ రెడ్డిపై ఓర్వలేని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని.. హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29714/