schedule Friday, September 11, 2026

జీఓ 29తో విద్యార్థులకు అన్యాయం

calendar_today October 20, 2024
person dharshininews
జీఓ 29తో విద్యార్థులకు అన్యాయం
జీఓ 29తో విద్యార్థులకు అన్యాయం - విద్యార్థుల జీవితాలో చెలగాటం ఆడొద్దు - రద్దు చేసి.. న్యాయం చేయాల్సిందే - జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ తీసుకవచ్చిన జీఓ 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. గ్రూపు-1 రిజర్వేషన్ల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌‌‌‌ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 55 నిబంధనలను ఉటంకిస్తూ మీరు తెచ్చిన జీవో 29 అదే అనటం అవగాహన రాహిత్యమే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టాప్‌ మార్కులు వచ్చినా జనరల్‌గా కాకుండా, రిజర్వేషన్‌గా పరిగణించడం వల్ల మరో రిజర్వ్‌డ్‌ అభ్యర్థికి అవకాశం లేకుండా పోతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి, జీవో 29 రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి విద్యార్థుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29908/