schedule Friday, September 11, 2026

ప్రవేటు కంపెనీలో సెక్యూరీటీ పోస్టులు

calendar_today October 22, 2024
person dharshininews
ప్రవేటు కంపెనీలో సెక్యూరీటీ పోస్టులు
ప్రవేటు కంపెనీలో సెక్యూరీటీ పోస్టులు - ఈనెల 24న వికారాబాద్‌లో జాబ్ మేళా - ప్రకటించిన జిల్లా ఉపాధి కల్పనా అధికారి వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కల్పనా అధికారులు గుడ్‌ న్యూస్ చెప్పారు. ప్రముఖ అంతర్జాతీయ సెక్యూరిటీ అయినా G4S సెక్యూరీటీ ప్రైవేటు కంపెనీలలో సెక్యూరీటీ పోస్టుల భర్తికి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటన తెలిపారు. ఈనెల 24న గురువారం ఉదయం 10-30 గంటలకు వికారాబాద్‌ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్‌లో జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. G4S సెక్యూరీటీ ప్రైవేటు కంపెనీలో సుమారు 100 (సెక్యూరిటీ గార్డ్స్, ఎస్కార్ట్ గార్డ్స్ కావలెను నైట్ షిప్ట్ మాత్రమే) పోస్టులు ఉన్నాయని వీటికి అబ్బాయిలు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. ఇట్టి ఉద్యోగానికి పదవ తరగతి ఉతీర్ణత కలిగిన వారితో పాటు అంత కంటే ఎక్కువ విద్యా అర్హత కలిగి ఉండాలని తెలిపారు. హైదరాబాదులోని నానాక్రంగూడ కోకాపేట DLF భవనము. 08 గంటల 26 డేస్ పనిదినములు ఉంటాయని, నెల జీతం 17000/-నుండి ఉంటుందని వివరించారు. ఈ జాబ్ మేళా అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరములకు నిర్వాహకులు మియా సాబ్ సెల్‌: 9676047444కు సంప్రదించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29938/