schedule Friday, September 11, 2026

తాండూరులో అభివృద్ధి జోరు..!

calendar_today October 24, 2024
person dharshininews
తాండూరులో అభివృద్ధి జోరు..!
తాండూరులో అభివృద్ధి జోరు..! - పనులు ప్రారంభించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతుంది. గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పట్టణంలోని పలు వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణ పనులు ప్రారంభించారు. పట్టణంలోని. 14వ వార్డులో రూ. 10లక్షలతో చేపడుతున్న పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వార్డు కౌన్సిలర్ బొంబీనాతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా పట్టణంలోని మరో వార్డులో పార్టీ నేతలతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ -రెడ్డి సహాకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ, ఏఈ, ఆయా వార్డుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29990/