ప్రతి విద్యార్థి ఆదర్శవంతంగా ఎదగాలి
October 26, 2024
dharshininews
ప్రతి విద్యార్థి ఆదర్శవంతంగా ఎదగాలి
- శాలివాహన డిగ్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే
- ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి విద్యార్థి ఆదర్శవంతగా ఎదగాలని తాండూరు శాలివాహన డిగ్రీ కాలేజీ వైస్ ప్రెసిడెంట్ కల్వ రాధాకృష్ణ అన్నారు. శనివారం కళాశాలకు చెందిన బీఏ, బీకాం ప్రథమ సంవత్సరం వి ద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే పేరుతో స్వాగత కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాలేజీ వైస్ ప్రెసిడెంట్ కల్వ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆదర్శవంతంగా ఎదగాలన్నారు. శ్రద్ధగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. కళాశాలకు, సమాజానికి పేరు తీసుకవచ్చేలా కష్టపడాలని సూచించారు.
కాలేజీ ప్రిన్సిపల్ శరత్ చంద్ర మాట్లాడుతూ వి ద్యార్థులు కష్టపడి చదువుకోవాలని అన్నారు. లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించుకునేందుకు నిరంతరం కష్టపడాలన్నారు. మరోవైపు ఫ్రెషర్స్ డే వేడుకలలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడామిక్ డైరెక్టర్ సిద్ది లింగయ్య స్వామి, డైరెక్టర్లు కట్కం వీరేందర్, బంటారం సుధాకర్, శివకుమార్, లక్ష్మారెడ్డి, మాధవరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/30030/