schedule Saturday, September 05, 2026

బాలికలకు స్ఫూర్తి భవిష్య రెడ్డి..!

calendar_today November 2, 2024
person dharshininews
బాలికలకు స్ఫూర్తి భవిష్య రెడ్డి..!
బాలికలకు స్ఫూర్తి భవిష్య రెడ్డి..! - రాష్ట్ర క్రికెట్ జట్టులో చోటు గర్వకారణం - సన్మానించిన అయేషా మాడల్ స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : అతి చిన్న వయస్సులోనే రాష్ట్ర క్రికెట్ జట్టులో స్థానం పొందిన తాండూరు అమ్మాయి భవిష్య రెడ్డి అందరి బాలికలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తాండూరు అయేషా మాడల్ స్కూల్ యజమాన్యం అభివర్ణించింది. తాండూరు లెజెండ్స్ క్రికెట్ అకాడమిలో శిక్షణ తీసుకున్న కరుణారెడ్డి, మమత రెడ్డిల కూతురు భవిష్య రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ అండర్ -15 రాష్ట్ర జట్టులో చోటు సంపాదించింది. ఇందుకు గాను శనివారం తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని అయేషా మాడెల్ స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ సలీం, డైరెక్టర్ ఖయ్యూం పాషల ఆధ్వర్యంలో భవిష్యరెడ్డితో పాటు లెజెండ్ క్రికెట్ అకాడమి కోచ్లు ఎండీ సాహిల్, ఎండీ సోహెల్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతిచిన్న వయస్సులోనే రాష్ట్ర క్రికెట్ జట్టులో భవిష్య రెడ్డి స్థానం సాధించడం తాండూరు కే గర్వకారణమన్నారు. భవిష్య రెడ్డి తాండూరులోని అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అమ్మాయిలు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని అన్నారు. భవిష్య రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అహమ్మది, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30253/