schedule Friday, September 11, 2026

ఉమాదేవి కృషి అభినందనీయం

calendar_today November 9, 2024
person dharshininews
ఉమాదేవి కృషి అభినందనీయం
ఉమాదేవి కృషి అభినందనీయం - జాతీయ అవార్డు సొంతం.. ఎంతో గర్వకారణం - సన్మానించిన ముదిరాజ్ యువజన సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన ఉమాదేవిని నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం ఘనంగా సన్మానించింది. శనివారం యువజన సంఘం అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో ఉమాదేవి, రాంచెందర్ దంపతులను వారి నివాసంలో సన్మానించారు. పర్యావరణానికి పెనుభూతంగా మారుతున్న ప్లాస్టిక్ రక్కసికి ప్రత్యామ్నాయంగా జూట్‌ బ్యాగులను తయారు చేస్తూ ఉపాధి కల్పిస్తున్న ఉమాదేవి కృషిని అభినందించారు. ముదిరాజుల ఆడపడుచుగా ఈరంగంలో రాణిస్తూ... జాతీయ స్థాయిలో గ్లోబల్ వుమెన్ అవార్డును పొందడం పట్ల సమాజానికి వన్నె తీసుకవచ్చిందని కీర్తించారు. జాతీయ స్థాయిలో అవార్డును పొందడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి టైలర్ రమేష్‌, ప్రధాన కార్యదర్శి పంజుగుల శ్రీనివాస్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30440/