schedule Saturday, July 04, 2026

పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు..!

calendar_today November 13, 2024
person dharshininews
పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు..!
పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు..! - కలెక్టర్ దాడి కేసులో అదుపులోకి - వికారాబాద్‌కు తరలింపు..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం కేబీఆర్‌ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్ట్.. వికారాబాద్ లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్‌ డేటా, సంభాషణలపై పోలీసుల దర్యాప్తు.. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు. దాడి కేసులో సూత్రదారిగా ఉన్న భోగమోని సురేష్‌తో పట్నం నరేందర్ రెడ్డి పలు మార్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని వికారాబాద్‌ తరలిస్తున్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్‌ నాయకులు స్పందించారు. నరేందర్ రెడ్డిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30527/