schedule Sunday, September 13, 2026

ఐసీఎల్‌ ఫ్యాక్టరీలో జాబ్ వెకెన్సీ..!

calendar_today November 20, 2024
person dharshininews
ఐసీఎల్‌ ఫ్యాక్టరీలో జాబ్ వెకెన్సీ..!
ఐసీఎల్‌ ఫ్యాక్టరీలో జాబ్ వెకెన్సీ..! - దరఖాస్తులను కోరుతున్న యజమాన్యం - అర్హతలు, గడువు ఎప్పటి వరకు అంటే..? తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం మల్కాపూర్‌ లోని ది ఇండియా సిమెంట్‌ లిమిటెడ్‌(ఐసీఎల్‌) ఫ్యాక్టరీలో జాబ్ వెకెన్సీ ఉన్నట్లు కర్మాగారం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కర్మాగారం హెచ్ఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మాన్యుఫ్యాక్చర్ యూనిట్ కింద కర్మాగారంలో లేబర్ వెల్పేర్ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఫ్యాక్టరీల చట్టం 1948, 1950లోని రూల్స్ 76-బీ ప్రకారం విద్యార్హతలు, వయస్సుతో పాటు మునుపటి అనుభవం తప్పక కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 22వ తేది లోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఇంటర్వూల తరువాత పోస్టును భర్తి చేసే అవకాశం ఉంటుందని ప్రతినిధులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30623/