schedule Sunday, July 05, 2026

పెద్దేముల్‌ ఎస్ఐ గిరికి స్థాన చలనం..!..!

calendar_today November 23, 2024
person dharshininews
పెద్దేముల్‌ ఎస్ఐ గిరికి స్థాన చలనం..!..!
పెద్దేముల్‌ ఎస్ఐ గిరికి స్థాన చలనం..! - యాలాల ఎస్ఐగా బదిలీ - కొత్త ఎస్ఐగా శ్రీధర్ రెడ్డి చార్జ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ ఎస్ఐ గిరికి స్థాన చలనం కలిగింది. ఆయనను యాలాల ఎస్ఐగా బదిలీ చేశారు. దీంతో పెద్దేముల్ ఎస్ఐ స్థానంలో కొత్త ఎస్ఐగా శ్రీధర్ రెడ్డి శనివారం చార్జ్ తీసుకున్నారు. పెద్దేముల్ పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎస్సై గిరి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే గత నెలలో నే ఓ విషయంలో ఎస్ఐ గిరిని బదిలీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇన్ని రోజుల వాయిదా తరువాత గిరిని యాలాల ఎస్ఐగా బదిలీ చేశారు. తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పెద్దేముల్ కొత్త ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్క తమవంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలని అన్నారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త ఎస్ఐ శ్రీధర్ రెడ్డికి స్టేషన్ ఉద్యోగులు స్వాగతం పలికారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30716/