schedule Friday, September 11, 2026

కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి

calendar_today December 1, 2024
person dharshininews
కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి
కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి - ఆలయంలో అన్నదానం అభినందనీయం - టీపీసీసీ ప్ర. కార్యదర్శి ధారాసింగ్, మాజీ ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని కట్ట మైసమ్మ కృప అందరిపై మెండుగా ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ లు అన్నారు. ఆదివారం అమావాస్య సందర్భంగా కట్ట మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారి కృప భక్తులపై మెండుగా ఉండి అందరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మిటి అధ్యక్షులు బి.నరేష్, ఉపాధ్యక్షులు నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శి కె. వేణుగోపాల్, ఉప కార్యదర్శి నర్సింలు, కోశాదికారి అంజిలయ్య, టీ.రాములు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు జే. సుధాకర్, ఎస్.సుధాకర్, పట్నం రమేష్, పాపయ్య, ఆనంద్, యాదగిరి రెడ్డి, దీలీప్ సింగ్ ఠాకూర్, ఆలయ అర్చకులు చందుస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31045/