schedule Thursday, September 10, 2026

ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి

calendar_today September 10, 2026
person dharshininews
ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి
ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ - తాండూరులో ఘన నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ కోరారు. గురువారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అన్యాయానికి ఎదురు నిలిచి ఆత్మగౌరవం కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆమె పోరాట చరిత్రపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఐలమ్మ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రజక కృష్ణ, వడ్డెర సమాజం జిల్లా అధ్యక్షుడు వడ్డే సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సమాజం తాండూరు అధ్యక్షుడు పరమేష్‌ నాయి, దోమ కృష్ణ, కేశవరావు, బీసీ సంఘం నాయకులు జోసెఫ్‌, రాము ముదిరాజ్‌, పరమేష్‌, తాండ్ర నరేష్‌, మంతటి రాజు, శ్రీనివాస్‌, రఘువీర్‌, నరేందర్‌, విశ్వేశ్వర్‌, బిచ్చప్ప, బాబు రాజ్‌, నవీన్‌, దత్తాత్రేయ, చిన్న, సాయి, వివేక్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44623/