schedule Friday, September 11, 2026

మున్సిపల్లో నిర్లక్ష్యపు పాలన..!

calendar_today December 1, 2024
person dharshininews
మున్సిపల్లో నిర్లక్ష్యపు పాలన..!
మున్సిపల్లో నిర్లక్ష్యపు పాలన..! - గాంధీనగర్ వధశాల నిర్వహణపై చిత్తశుద్ధి కరువు - మండిపడిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో పాలకవర్గం నిర్లక్షపు పాలన చేస్తున్నారని గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా వార్డులో ఉన్న వధశాల(కమేలా) నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఆదివారం వధశాలకు ఏర్పాటు చె యకుండా వదిలేసిన గేటును తిరిగి బిగించే పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు మున్సిపల్లో అధికార కౌన్సిల్ పాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు. గత కొన్ని రోజులుగా వధశాలలో పారిశుద్ధ్య పనులు, నిర్వహణను గాలికి వదిలేశారని అన్నారు. దీంతో వీధి కుక్కలు వధశాల నుంచి మూగ జీవాల వ్యర్థాలను ఇండ్ల మద్యలోకి తీసుకవచ్చి వదిలేస్తున్నాయని అన్నారు. వ్యర్థాలు రోడ్లపై పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చైర్ పర్సన్, కమీషనర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని మండిపడ్డారు. మున్సిపల్ పాలన నిర్లక్ష్యంగా కొనసాగడంతో పాటు, చిత్తశుద్ధి కరువు అయినట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ప్రజా పాలన సంబరాలలో ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు, ప్రజలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31052/