schedule Friday, September 11, 2026

రేపు అయ్యప్ప స్వామి పడిపూజ

calendar_today December 3, 2024
person dharshininews
రేపు అయ్యప్ప స్వామి పడిపూజ
రేపు అయ్యప్ప స్వామి పడిపూజ - పట్నం రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు - హాజరుకానున్న చీఫ్‌ మహేందర్ రెడ్డి - జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ నిర్వహిస్తున్నారు. తెలంగాణ చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డిల తనయుడు రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే దేవాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 10-15గంటలకు పడిపూజ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డిలు హాజరుకానున్నారు. అయ్యప్ప స్వాములు, స్వామి భక్తులు, రాజకీయ, పట్టణ ప్రముఖులు హాజరు కావాలని పట్నం రినీష్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31130/